ట్రిపుల్‌ సెంచరీ- 40,300కు సెన్సెక్స్‌

19 Oct, 2020 09:39 IST|Sakshi

317 పాయింట్లు అప్‌- 40,300కు సెన్సెక్స్‌

92 పాయింట్లు పెరిగి 11,854 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

బ్యాంకింగ్‌, మెటల్‌, రియల్టీ రంగాలు ప్లస్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లకు డిమాండ్‌

వారం ప్రారంభంలోనే దేశీ స్టాక్‌ మార్కెట్లకు హుషారొచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 317 పాయింట్లు జంప్‌చేసి 40,300కు చేరింది. తద్వారా 40,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ సైతం 92 పాయింట్లు పెరిగి 11,854 వద్ద ట్రేడవుతోంది. యూఎస్‌ ఫ్యూచర్స్‌ 0.6 శాతం పుంజుకోగా.. ఆసియాలోనూ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. దీంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణలు పేర్కొన్నారు.

ఐటీ, మీడియా వీక్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంకింగ్‌, రియల్టీ, మెటల్‌ 2-1 శాతం మధ్య ఎగశాయి. ఐటీ, మీడియా 0.3 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, గెయిల్‌, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, యాక్సిస్‌, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌, 3.7- 1.3 శాతం మధ్య ఎగశాయి. అయితే యూపీఎల్‌, సిప్లా, దివీస్‌, ఐషర్‌, టీసీఎస్‌, హీరో మోటో, అదానీ పోర్ట్స్‌ 1.7-0.5 శాతం  మధ్య క్షీణించాయి.

బ్యాంక్స్‌ అప్
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఫెడరల్‌ బ్యాంక్‌, అదానీ ఎంటర్, డీఎల్‌ఎఫ్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, బీవోబీ, పిరమల్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, బంధన్‌ బ్యాంక్‌, సెయిల్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ 5-1.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు పీవీఆర్‌, ఐడియా, యూపీఎల్‌, అంబుజా, జూబిలెంట్‌ ఫుడ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, మైండ్‌ట్రీ, వేదాంతా, బయోకాన్‌ 2.2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.3-0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,039 లాభపడగా.. 418 నష్టాలతో కదులుతున్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు