Stock Market closing: రోజంతా ఒడిదుడుకులు,చివరికి ఫ్లాట్‌

10 Aug, 2022 15:37 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాలనుంచి భారీగా పుంజుకుని స్వల్ప నష్టాలకు పరిమితమైనాయి. ముఖ్యంగా ఐటీ, రియల్టీ, ప్రభుత్వ రంగ  బ్యాంకుల షేర్ల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి చివరికి సెన్సెక్స్ 35 పాయింట్లు క్షీణించి 58,817 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు లాభంతో  17534 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 17500కి ఎగువన,సెన్సెక్స్‌ 58800కి ఎగువన ముగియడం విశేషం. 

హిందాల్కో, యూపీఎల్‌, అపోలో హాస్పిటల్స్‌, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా టాప్‌ గెయినర్స్‌గా,  బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఆసియన్‌ పెయింట్స్‌, అదానీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ నష్టపోయాయి. అటు డాలరుమారకంలో రూపాయి  భారీగా పుంజుకుంది.   24 పైసలు లాభంతో 79.46  వద్ద  ఉంది. 
 

మరిన్ని వార్తలు