Stock Market Opening: మార్కెట్‌ రీబౌండ్‌: భారీ నష్టాల్లో ఐటీ షేర్లు

23 Aug, 2022 09:41 IST|Sakshi

రెండు రోజుల నష్టాలకు చెక్‌

లాభనష్టాలమధ్య తీవ్ర ఊగిసలాట

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో పప్రారంభమైనాయి. అయితే ఆరంభంలో  అమ్మకాల ఒత్తిడినుంచి కీలక సూచీలు  కోలుకున్నాయి. కానీ తీవ్ర ఊగిసలాట కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 55 పాయింట్ల  లాభంతో  58, 828 వద్ద కొనసాగుతోంది. తద్వారా 58వేల 800 స్థాయిని తిరిగి నిల బెట్టుకుంది. నిఫ్టీ లాభాల్లోకి పుంజుకుంది. 7 పాయింట్ల లాభంతో 17481 కొనసాగుతోంది. తద్వారా రెండు రోజుల నష్టాలకు చెక్‌ చెప్పాయి. 

అదానీ పోర్ట్స్‌, ఐషర్‌ మోటార్స్‌, హిందాల్కో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌ లాభపడుతున్నాయి. ఇన్ఫోసిస్‌, టెక్‌  మహీంద్ర, హెచ్‌సీఎల్‌  టెక్‌, విప్రో, టీసీఎస్‌ నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు