లాభాల రింగింగ్‌: సెన్సెక్స్‌, నిఫ్టీ హైజంప్‌

14 Jun, 2022 10:23 IST|Sakshi

53 వేల ఎగువకు సెన్సెక్స్‌

సాక్షి,ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కనిష్ట స్థాయిల్లో కొనుగోళ్లతో  దాదాపు 300 పాయింట్ల మేర రీబౌండ్‌ అయ్యాయి.  ఆరంభంలో సోమవారం నాటి అమ్మకాల ఒత్తిడి మంగళ వారం కూడా కొనసాగింది.   ట్రేడింగ్‌ స్టార్టింగ్‌లో దాదాపు 100 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్‌ 53 పాయింట్ల నష్టంతో 52794వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు నీరసించి 15753 వద్ద  కొనసాగినా  ఆ తరువాత భారీగా పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 193 పాయింట్ల లాభంతో 53040  వద్ద, నిప్టీ  కూడా 65 పాయింట్లు లాభపడి 15835 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. 

మెటల్‌​ తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ఏషియన్‌  పెయింట్స్‌, బీపీసీఎల్‌, ఇండస్‌ ఇండ్‌, బజాజ్‌ ఆటో, రిలయన్స్‌ నష్టపోతుండగా, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌ గ్రిడ్‌, అపోలో హాస్పిటల్స్‌, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్‌, విప్రో లాభపడు తున్నాయి.  అటు దేశీయ కరెన్సీ రూపాయి అల్‌ టైం కనిష్టం నుంచి తేరుకుంది.  డాలరు మారకంలో ఆరంభంలో 2 పైసలు ఎగిసి ప్రస్తుతం 78.05 వద్ద  ఉంది

ఫెడ్‌ రేటు పెంపుదల ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి  జారుకోనుందనే భయాలతో వాల్ స్ట్రీట్‌ లో కూడా ఇన్వెస్టర్ల  అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇది ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. అలాగే దేశీయంగా అలాగే రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 7.04 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో  7.79 శాతంతో   ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి చేరుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు