38,000 దిగువకు సెన్సెక్స్‌- ఐటీ, ఫార్మా అప్‌

22 Sep, 2020 16:03 IST|Sakshi

300 పాయింట్లు డౌన్‌- 37,734 వద్ద ముగింపు

97 పాయింట్లు క్షీణించి 11,154 వద్ద నిలిచిన నిఫ్టీ

మీడియా, ఆటో, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌ డౌన్‌

ఐటీ, ఫార్మా రంగాల ఎదురీత- 0.7 శాతం ప్లస్

‌బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.6 శాతం మైనస్

తొలుత సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ తదుపరి అమ్మకాలు ఊపందుకోవడంతో రెండో రోజూ దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లు క్షీణించి 37,734 వద్ద ముగిసింది. వెరసి 38,000 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇక నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 11,154 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,210- 37,531 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,302- 11,085 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. గ్లోబల్‌ బ్యాంకులలో అవకతవకల ఆరోపణలు, కోవిడ్‌-19 కేసులు పెరగడంతో యూరప్‌లో తిరిగి లాక్‌డవున్‌లు ప్రకటించడం వంటి పలు ప్రతికూల అంశాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

ఆదుకున్న ఐటీ
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ, మెటల్‌,  రంగాలు 2.6-1.25 శాతం మధ్య  క్షీణించగా.. ఐటీ, ఫార్మా 0.7 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ 7 శాతం కుప్పకూలగా.. అదానీ పోర్ట్స్‌, ఇన్ఫ్రాటెల్‌, గెయిల్‌, మారుతీ, ఇండస్‌ఇండ్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌, బీపీసీఎల్‌, ఎల్‌అండ్‌టీ, ఓఎన్‌జీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఐవోసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హీరో మోటో, హిందాల్కో, ఐషర్‌, ఆర్‌ఐఎల్‌ 4.7-1.6 శాతం మధ్య నష్టపోయాయి. అయితే ఇతర బ్లూచిప్స్‌లో హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, సన్‌ ఫార్మా, టెక్‌ మహీంద్రా, గ్రాసిమ్‌, అల్ట్రాటెక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐసీఐసీఐ, సిప్లా, ఎస్‌బీఐ, ఎయిర్‌టెల్‌ 3-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. 
 
నష్టాలలో..
డెరివేటివ్‌ కౌంటర్లలో కెనరా బ్యాంక్‌, మణప్పురం, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, జీఎంఆర్‌, ఇండిగో, భెల్, హెచ్‌పీసీఎల్‌, బాష్‌, ఎంజీఎల్‌, బీఈఎల్‌, నాల్కో, బంధన్‌ బ్యాంక్‌, గ్లెన్‌మార్క్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ 6-2.7 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు దివీస్‌, కోఫోర్జ్‌, మైండ్‌ట్రీ, అదానీ ఎంటర్‌, అరబిందో, సన్‌ టీవీ 3.4-1.2 శాతం మధ్య ఎగశాయి. .బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.6 శాతం  చొప్పున క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1,874 నష్టపోగా.. 753 మాత్రమే లాభాలతో ముగిశాయి.

అమ్మకాలవైపు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 540 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 518 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 205 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 101 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు