నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

15 Mar, 2021 16:41 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిసాయి. అంతర్జాతీయంగా వ్యతిరేక పవనాల నేపథ్యంలో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా దిగజారుతూ పోయాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ కీలక 50వేల మార్క్‌ను.. నిఫ్టీ 15వేల మార్క్‌ను దగ్గరకు చేరుకుంది. ఉదయం 51,404 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ ప్రీట్రేడింగ్‌లో 50,834 వద్ద గరిష్ఠాన్ని తాకి మధ్యాహ్నం తర్వాత 49,799 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 397 పాయింట్లు నష్టపోయి 50,395 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 15,048 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 15,048 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత నుంచి 303 పాయింట్లు కోల్పోయి 14,745 కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 107 పాయింట్లు నష్టపోయి 14,923 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.47 వద్ద నిలిచింది.

చదవండి:

ఏప్రిల్ 1 నుంచి ఐటీలో ఐదు కొత్త నిబంధనలు

2నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం

మరిన్ని వార్తలు