రోజంతా ఊగిసలాట: తప్పని వరుస నష్టాలు

15 Jun, 2022 15:36 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. రోజంతా లాభ నష్టాల మధ్య  ఊగిసలాడినా  చివరికి నష్టాలు తప్పలేదు. ఫలితంగా వరుసగా నాలుగోరోజూ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి.  చివరికి సెన్సెక్స్‌ 152 పాయింట్లు కోల్పోయి 52541 వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 15692 వద్ద స్థిరపడ్డాయి.  

దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి.  ప్రధానంగా  మెటల్‌ , ఐటీ షేర్లు నష్టపోగా, ఆటో రంగ షేర్లు లాభపడ్డాయి.  బజాజ్‌  ఫిన్‌ సర్వ్‌, టాటా మోటార్స్‌,  బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ , హీరోమోటో కార్ప్‌, దివీస్‌ లాబ్స్‌ లాభాల్లో ముగిసాయి. అయితే 5జీస్పెక్ట్రమ్‌ వేలానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో టెలికాం షేర్లు లాభపడ్డాయి. ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝన్‌ ఝన్‌ వాలా తన కంపెనీ డెల్టా కార్ప్‌లో  75 లక్షల షేర్లను విక్రయించారు. దీంతో  షేరు  4 శాతం నష్టపోయింది.  టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్‌ విప్రో  టాప్‌  లూజర్స్‌గా నిలిచాయి. 

మరిన్ని వార్తలు