లాభాల ముగింపు: 53వేల ఎగువకు సెన్సెక్స్‌

27 Jun, 2022 15:35 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభంలో 700 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌  చివరికి హైస్థాయిల్లో లాభాల స్వీకరణతో కీలక సూచీలు లాభాలను పరిమితం చేసుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 433 పాయింట్లు  ఎగిసి 53161 వద్ద,నిఫ్టీ 133 పాయింట్లు లాభంతో 15832 వద్ద స్థిరపడింది. ఫలితంగా సెన్సెక్స్‌ 53వేలకుఎగువన ముగియగా,నిఫ్టీ 15800 స్థాయిని నిలబెట్టుకోవడం విశేషం.

అన్నిరంగాల షేర్లు లాభాల్లోనే ముగిసాయి. ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, కోల్‌ ఇండియా, ఎల్‌ అండ్‌ టీ, టెక్‌ మహీంద్ర, యూపీఎల్‌ లాభ పడగా,  ఐషర్‌ మోటార్స్‌, అపోలో హాస్పిటల్స్‌, కోటక్‌ మహీంద్ర, హెచ్‌డీఎఫ్‌సీ  లైఫ్‌, రిలయన్స్‌ టాప్‌ లూజర్స్‌గా   మిగిలాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి కూడా ఆరంభ లాభాలను కోల్పోయింది. సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో యుఎస్ డాలర్‌తో రూపాయి 6 పైసలు పెరిగి 78.27 వద్ద ఉంది.  చివరికి 78. 35 వద్ద  నష్టాలతో ముగిసింది. 
 

మరిన్ని వార్తలు