బ్లాక్‌ ఫ్రైడే: మార్కెట్లు ఢమాల్‌ 

23 Sep, 2022 14:39 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో  కొనసాగుతున్నాయి. ఆరంభంలో  బాగా నష్టపోయిన సూచీలు మిడ్‌సెషన్‌లో మరింత కుదేలయ్యాయి.  సెన్సెక్స్‌ 1116 పాయింట్లు కుప్ప కూలింది. నిఫ్టీ 329 పాయింట్లు పతనమైంది.  దాదాపు అన్ని రంగాల  షేర్లలో అమ్మకాల వెల్లువెత్తాయి.  బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో సెన్సెక్స్ 59000 దిగువకు పడిపోయింది.

టాటా స్టీల్, సన్ ఫార్మా, హిందుస్తాన్  హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటన్‌,  మారుతీ సుజుకీ స్టాక్స్ లాభాల్లో ఉండగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. టాటా స్టీల్ బోర్డు తన గ్రూప్ కామ్‌లోని ఏడుకంపెనీల  విలీన పథకానికి శుక్రవారం ఆమోదం తెలిపింది.

మరిన్ని వార్తలు