లడాఖ్ టెన్షన్ : కుప్పకూలిన మార్కెట్ 

31 Aug, 2020 14:56 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయస్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. సోమవారం ఆరంభంలో ఉత్సాహంగా ఉన్న సూచీలు  ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనైనాయి. ప్రధానంగా లడఖ్‌ సరిహద్దులో భారత్‌-చైనాల మధ్య ఉద్రిక్తతలురీత్యా మార్కెట్లు ఒక్కసారిగా ఒత్తిడికి గురయ్యాయి. దీనికి తోడు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, అస్పష్టమైన ఆర్థిక డేటా లాంటి కారణాలతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉందని, హై స్థాయిల్లో ఇన్వెస్టర్ల అప్రమత్తత కారణంగా లాభాల స్వీకరణ కనిపించిందని మార్కెట్ నిపుణులు భావించారు. సెన్సెక్స్‌ 40,000 గరిష్ట స్థాయిని  తాకిన సెన్సెక్స్  భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది.  చివరి అర్ధగంటలో కోలుకున్నప్పటికీ చివరకు సెన్సెక్స్  839 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 260 పాయింట్లు పతనమైంది.

సెన్సెక్స్‌ ఒకదశలో ఏకంగా 1035 పాయింట్లకు పైగా కుప్పకూలింది. నిఫ్టీ దాదాపు 300 పాయింట్లకు పైగా నష్టంతో 11500 దిగువకు  చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిసాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మ ఆటో, ఐటీ, మెటల్,  భారీగా నష్టపోయాయి. ఇండస్‌ఇండ్‌, సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ, కొటక్‌ బ్యాంక్‌,  ఐషర్‌, బజాజ్‌ ఫిన్‌, ఎస్‌బీఐ, శ్రీ సిమెంట్‌, జీ, సిప్లా, ఎల్‌అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ, యాక్సిస్ భారీ నష్టాల్లో ముగిసాయి. మరోవైపు ఓఎన్‌జిసి, భారతి ఇన్‌ఫ్రాటెల్, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా స్వల్పంగా లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు