కరోనా సెకండ్ ‌వేవ్‌: కుప్పకూలిన మార్కెట్‌

12 Apr, 2021 09:32 IST|Sakshi

సాక్షి,ముంబై:  రెండో దశలో దేశంలో  విస్తరిస్తున్న కరోనా వైరస్‌, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్‌  ఆరంభంలోనే  భారీ పతనాన్ని నమోదు చేసింది.  సెన్సెక్స్‌ 916, నిఫ్టీ 276 పాయింట్ల మేర  నష్టపోయాయి. అనంతరం మరింత క్షీణించిన  సెన్సెక్స్‌ 1160 పాయింట్ల నష్టంతో 48430 వద్ద, నిఫ్టీ 354  పాయింట్లు పతనమై 14482 వద్ద కొనసాగుతోంది.  దాదాపు అన్ని రంగాల షేర్లు  అమ్మకాల దెబ్బతో కుప్పకూలాయి. నిఫ్టీ బ్యాంకు కూడా దాదాపు 1200 పాయింట్లు క్షీణించింది. సెన్సెక్స్‌ 1353పాయింట్ల నష్టంతో 484237వద్ద, నిఫ్టీ  411 పాయింట్లు పతనమై 14423 వద్ద కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ 48300, నిఫ్టీ 14500 స్థాయిని కూడా కోల్పోయి మరింత బలహీన సంకేతాలనందించాయి. దేశంలో కరోనా ఉధృతి అంతకంతకూ  పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితంగా చేస్తోంది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలోనూ భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. (ఇల్లు కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా...అయితే మీకో శుభవార్త!)

కేసుల నమోదులో సరికొత్త రికార్డు: కాగా తాజా గణాంకాల ప్రకారం దేశంలో 168012 కొత్త పాజిటివ్‌ కేసులో నమోదయ్యాయి. కరోనా కేసుల నమోదుకు సంబంధించి సరికొత్త రికార్డుతో మరింత బెంబేలెత్తిస్తున్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు