StockMarket Closing: రిలయన్స్‌ షాక్‌, భారీ నష్టాలు

1 Sep, 2022 16:04 IST|Sakshi

సెన్సెక్స్‌ 770 పాయింట్ల పతనం 

నిఫ్టీ 17550 దిగువకు 

ఆయిల్‌ రంగ షేర్లకు విండ్‌ఫాల్‌ టాక్స్‌ షాక్‌

సాక్షి,ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. ప్రపంచ వృద్ధి ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపడంతో గురువారంకీలక సూచీలు ఆరంభంలోనే కుప్పకూలాయి. రోజంతా  అమ్మకాలు, కొనుగోళ్ళ మధ్య తీవ్ర ఒత్తిడితో ఊగిసలాడాయి. దీనికితడు బలహీనమైన దేశీయ జీడీపీ డేటా, ఆగస్ట్‌ తయారీ రంగం పీఎంఐ తగ్గుదల ఇ‍న్వెస్టర్ల సెంటిమెంట్‌నుప్రభావితం చేసింది.

ఫలితంగా సెన్సెక్స్ ఇంట్రా-డేలో 1,014 పాయింట్లు  పతనమైంది. చివరికి  770.5 పాయింట్లు లేదా 1.29 శాతం క్షీణించి 58,766 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 50 కూడా 216.5 పాయింట్లు లేదా 1.22 శాతం  క్షీణించి  17,543 వద్ద  స్థిరపడింది. ఒకదశలో 17,468 వద్ద కనిష్ట స్థాయిని తాకింది.నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.9 శాతం నిఫ్టీ ఫార్మా 1.12 శాతం నష్టపోయాయి. విండ్ ఫాల్‌టాక్స్‌ ప్రభావంతో ఆయిల్‌ రంగషేర్లుకూడా నష్టాల్లోనే ముగిసాయి. రిలయన్స్  3 శాతం  నష్టపోగా, టీసీఎస్‌, సన్ ఫార్మా, టెక్ ఎం,హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐషేర్లు ఒక్కొక్కటి 1.5 శాతానికి పైగా పడిపోయాయి. అయితే రియాల్టీ , ఆటో స్వల్పంగా లాభపడ్డాయి.  ఏసియన్‌పెయింట్స్‌,  బజాజ్‌ఫిన్స్‌సర్వ్‌, ఐషర్‌ మోటార్స్‌, హీరోమోటో లాభపడ్డాయి. 

అటు డాలరుమారకంలో రూపీ 10 పైసల నష్టంతో 79.53 వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2 శాతం తగ్గి బ్యారెల్ మార్క్‌కు 100 డాలర్ల కంటే దిగువకు చేరింది.

మరిన్ని వార్తలు