బెంబేలెత్తిస్తున్న కరోనా, అక్షరాల రూ.14 లక్షల కోట్లు బూడిద పాలు

26 Nov, 2021 15:54 IST|Sakshi

గత కొద్ది రోజులుగా దేశీయ మార్కెట్లు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం స్టాక్‌మార్కెట్‌లో లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. ఒకానొక దశలో ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 18,604 పాయింట్లతో రికార్డు సృష్టించింది. దీంతో ఇన్వెస్టర్లకు కొంత ఊరట లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ సౌతాఫ్రికా కొత్త వేరియంట్‌ భయం దేశీయ మార్కెట్లపై చూపించడంతో సూచీలు 8% క్షీణించి దాదాపు రూ.14 లక్షల కోట్లు బూడిపాలయ్యాయి.

 

ఒకానొక సమయంలో
మార్కెట్‌లో ట్రేడింగ్‌ కొనసాగే సమయంలో టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, హిందాల్కో, బీపీసీఎల్ స్టాక్స్‌ భారీఎత్తున నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ అధికారిక లెక్కల ప్రకారం..మార్కెట్‌ ప్రారంభంలో టాటా మోటార్స్‌ 4శాతం, ఓఎన్‌జీసీ 3.9శాతం నష్టపోయాయి. నిఫ్టీ 50లో ఫార్మా షేర్లు సిప్లా, డాక్టర్ రెడ్డిస్‌ షేర్లు నష‍్టాల్ని చవి చూశాయి. దీంతో దేశీయ మార్కెట్‌కు రూ.6.5లక్షల కోట్లు నష్టం వాటిల్లింది.         

కొత్త వేరియంట్‌తో భయం భయం
దక్షిణాఫ్రికా కొత్త కరోనా వేరియంట్‌ ఆ దేశ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మింట్ నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అందుకు ఈ కరోనా కొత్త వేరియంట్‌ B.1.1.529 కారణమని తెలుస‍్తోంది. హాంకాంగ్‌లో ఈ కొత్త వేరియంట్‌ కేసులు నమోదు కావడంతో..సైంటిస్ట్‌లు ఈ కొత్త వేరియంట్‌ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త వేరియంట్‌ వేగంగా విజృంభించే అవకాశం ఉందని,జాగ్రత్తగా ఉండాలని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఇదే భయం ఇతర దేశాలలోని మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. దీంతో సౌతాఫ్రికా కొత్త వేరియంట్‌ ప్రభావం ప్రపంచ దేశాల మార్కెట్‌లలో మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

చదవండి: ఐపీవో ఎఫెక్ట్‌.. ఏకంగా బిలియనీర్‌ అయ్యాడు

మరిన్ని వార్తలు