స్టాక్‌ మార్కెట్లో బ్లడ్‌ బాత్‌! రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి!

13 Jun, 2022 16:11 IST|Sakshi

ముంబై: అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు, అదుపులోకి రాని క్రూడ్‌ ఆయిల్‌ ధరలు, చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు అన్ని మార్కెట్లను అతలాకుతలం చేశాయి. దీంతో సోమవారం మొత్తం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల‍్ని చవిచూశాయి. ఎన్నడూ చూడని రీతిలో షేర్లు పతననమవడంతో రోజంతా బ్లడ్‌ బాత్‌ కొనసాగింది. కేవలం ఒక్కరోజులోనే రూ7లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరై పోయింది.  

సోమవారం మార్కెట్‌లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 1456 పాయింట్ల భారీ నష్టంతో 52,846 వద్ద నిఫ్టీ 427 పాయింట్ల నష్టంతో 15,744 వద్ద ట్రేడింగ్‌ ముగిసింది. 

బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్ మహీంద్రా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టపోయాయి. బ్యాంక్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఆటో, మెటల్‌, ఐటీ, రియల్‌ ఎస‍్టేట్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌తో సహా ఇలా అన్నీ సెక్టార్‌ల షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి.

మరిన్ని వార్తలు