StockMarketClosing: లాభాలు పోయాయ్‌! అయినా స్ట్రాంగ్‌గానే మార్కెట్‌

20 Sep, 2022 15:36 IST|Sakshi

సాక్షి, ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గినా చివరికి లాభాల్లోనే ముగిసాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 1000 పాయింట్లు ఎగిసి 60 వేల మార్క్ స్థాయికి చేరింది. అలాగే 206 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 17850స్థాయికి పైన కదలాడింది. కానీ ఆఖరి గంటలో లాభాల స్వీకరణతో చాలావరకు లాభాలను వదులుకున్నాయి.  చివరికి సెన్సెక్స్‌ 579 పాయింట్లు లాభంతో 59719 వద్ద, నిఫ్టీ 194 పాయింట్లుఎగిసి 17816 వద్ద ముగిసింది. 

దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా రంగ షేర్లు లాభాలు మార్కెట్లకు భారీ ఊతమిచ్చాయి. అపోలో హాస్పిటల్స్‌, సిప్లా, సన్‌ ఫార్మా, ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, టాటాస్టీల్‌, టైటన్‌, ఏసియన్‌పెయింట్స్‌, టీవీఎస్‌ మోటార్‌, యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు భారీగా ఎగిసాయి. అయితే హెవీ వెయిట్‌ షేర్లు రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌ చివర్లో నష్టపోయాయి. ఇది మార్కెట్లను ప్రభావితం చేసింది. మరోవైపు నెస్లే, శ్రీసిమెంట్స్‌, గ్రాసింగ్‌, పవర్‌గ్రిడ్‌, నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప లాభంతో 79.75 వద్ద ముగిసింది.

>
మరిన్ని వార్తలు