లాభాల స్వీకరణ: నష్టాలతో ప్రారంభం

24 Jul, 2020 09:29 IST|Sakshi

300 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్‌ 

11500దిగువకు నిఫ్టీ

ఫార్మా తప్ప అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు

గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్‌ 38వేల స్థాయిని కోల్పోయి 300 పాయింట్ల నష్టంతో 37840 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 11145 వద్ద మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఐటీసీ, ఏషియన్‌ పేయింట్స్‌, అంజుజా సిమెంట్స్‌తో పాటు 71కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. దీనికి తోడు మార్కెట్‌ను వారంతపు రోజు కావడంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహిస్తున్నారు. ఒక్క ఫార్మా షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలకు చెందిన ఇండెక్స్‌లు 1శాతానికి పైగా నష్టాలతో మొదలయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం నష్టంతో 23వేల మార్కును కోల్పోయి 22,853 వద్ద ప్రారంభమైంది. 

ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐషర్‌మోటర్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, సిప్లా, సన్‌ఫార్మా షేర్లు 0.10శాతం నుంచి 3.30 లాభపడ్డాయి. 
 

మరిన్ని వార్తలు