కోవిడ్‌ టెర్రర్‌: భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్‌

3 May, 2021 10:08 IST|Sakshi

వరుసగా 6వ రోజు కూడా 3 వేలకు పైగా మరణాలు

సెన్సెక్స్‌ ఆరంభంలో 600  పాయింట్లు  పతనం

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు  భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దేశీయంగా కరోనా మహమ్మారి విలయానికి తోడు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ట్రేడింగ్ ప్రారంభంలోనే 600 పాయింట్లు కుప్పకూలి భారీ పతనాన్ని నమోదు చేసింది. పతనం నుంచి  తేరుకున్న సెన్సెక్స్  ప్రస్తుతం 344 పాయింట్ల నష్టంతో 48437 వద్ద, 88 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 14549వద్ద ట్రేడవుతోంది. మెటల్స్, ఆటోమొబైల్, హెల్త్‌కేర్ మినహా మిగిలిన రంగాలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. బ్యాంకింగ్, కన్యూజర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లోని షేర్లు ఎక్కువగా నష్టపోతున్నాయి.

ఎం అండ్ ఎం, టాటా స్టీల్, మారుతి సుజుకి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందుస్తాన్ యూనిలీవర్  లాభాల్లోనూ, టైటన్ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్స్ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. మరో వైపు  దేశంలో  కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. వరుసగా 6వ రోజు కూడా 3వేలకు పైగామరణాలను నమదయ్యాయి. పాజిటివ్‌ కేసుల నమోదు గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.68లక్షలుగా ఉంది. దీంతో మొత్తం కరోనాబాధితుల సంక్య 1.99 కోట్లుగా ఉండగా 3,417 మరణాలతో మొత్తం మరణాల సంఖ్య  2.18 లక్షలకు చేరింది.

మరిన్ని వార్తలు