డబుల్‌ సెంచరీ- అన్ని రంగాలూ ప్లస్‌

18 Aug, 2020 09:45 IST|Sakshi

222 పాయింట్లు అప్‌-38,273కు సెన్సెక్స్‌

70 పాయింట్లు ఎగసి 11,317 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

బ్యాంకింగ్‌, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా లాభాల్లో

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం అప్

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 222 పాయింట్లు జంప్‌చేసి 38,273కు చేరింది. నిఫ్టీ సైతం70 పాయింట్లు బలపడి 11,317 వద్ద ట్రేడవుతోంది. సోమవారం డోజోన్స్‌ డీలాపడగా.. నాస్‌డాక్‌ సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది.

మీడియా డీలా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన రంగాలు బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ తదితరాలు 0.3 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. మీడియా మాత్రమే(0.5 శాతం) నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో గ్రాసిమ్‌, ఓఎన్‌జీసీ, ఇన్‌ఫ్రాటెల్‌, ఆర్‌ఐఎల్‌, ఐసీఐసీఐ, ఐషర్‌, ఎన్‌టీపీసీ, విప్రో, బ్రిటానియా 5-1 శాతం మధ్య ఎగశాయి. అయితే జీ, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్, పవర్‌గ్రిడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గెయిల్‌, హీరో మోటో 1.5-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి.
 
డీఎల్‌ఎఫ్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో డీఎల్‌ఎఫ్‌, అదానీ ఎంటర్‌, పెట్రోనెట్‌, అశోక్‌ లేలాండ్‌, జూబిలెంట్ ఫుడ్‌, బాలకృష్ణ, ముత్తూట్‌, బెర్జర్‌ పెయింట్స్‌, హావెల్స్‌ 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు గ్లెన్‌మార్క్‌, పీవీఆర్‌, టొరంట్‌ పవర్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, మదర్‌సన్‌, ఐడియా, జిందాల్‌ స్టీల్‌, అపోలో హాస్పిటల్‌, అరబిందో ఫార్మా 1-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1295 లాభపడగా.. 517 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు