ఒడిదొడుకుల మధ్య డబుల్‌ సెంచరీ

30 Oct, 2020 09:41 IST|Sakshi

207 పాయింట్లు ప్లస్‌- 39,957కు సెన్సెక్స్‌

60 పాయింట్లు బలపడి 11,731కు చేరిన నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1-0.7 శాతం అప్

కొత్త డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించింది. 207 పాయింట్లు పెరిగి 39,957కు చేరగా.. నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకుని 11,731 వద్ద ట్రేడవుతోంది. క్యూ3(జులై- సెప్టెంబర్‌)లో ఆర్థిక వ్యవస్థ 33 శాతం పురోగమించడంతో గురువారం యూఎస్‌ మార్కెట్లు 0.5-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఆసియాలో అధిక శాతం మార్కెట్లు నీరసంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలుత 39,636 వరకూ వెనకడుగు వేసిన సెన్సెక్స్‌ తదుపరి 39,980 వరకూ జంప్‌చేసింది. 

మీడియా, రియల్టీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మీడియా, రియల్టీ, మెటల్‌, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.6-1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌, కోల్‌ ఇండియా, విప్రో, హిందాల్కో, టాటా మోటార్స్‌, ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్డీఎఫ్‌సీ లైఫ్‌ 2.4-1.3 శాతం మధ్య ఎగశాయి. అయితే పవర్‌గ్రిడ్‌, ఐషర్‌, మారుతీ, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌ 1-0.3 శాతం మధ్య డీలాపడ్డాయి.

ఐడియా అప్‌
డెరివేటివ్స్‌లో ఐడియా, ఆర్‌ఈసీ, టీవీఎస్‌ మోటార్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, అమరరాజా, నౌకరీ, జీ, హెచ్‌పీసీఎల్‌, పీఎఫ్‌సీ 5-2.2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క టాటా కెమికల్స్‌, ఇండిగో, ఐసీఐసీఐ లంబార్డ్‌, గోద్రెజ్‌ సీపీ, బీవోబీ, బంధన్‌ బ్యాంక్‌ 3.2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిఢ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1-0.7 శాతం మధ్య పెరిగాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,177 లాభపడగా.. కేవలం 404 నష్టాలతో ట్రేడవుతున్నాయి.
 

మరిన్ని వార్తలు