Stockmarkets : నష్టాలు, వొడాఫోన్‌ ఐడియా ఢమాల్‌!

1 Jul, 2021 11:05 IST|Sakshi

నష్టాల్లోకి జారుకున్న సూచీలు

 లాభాల్లో ఆటో రంగ షేర్లు

నష్టాల్లో బ్యాంకు, ఐటీ రంగ షేర్లు

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బలహీనంగా కొనసాగుతున్నాయి. ఆరంభంలో అటూ ఇటూ కదలాడినప‍్పటికీ, ప్రస్తుతం నష్టాల్లోకి జారుకున్నాయి.  సెన్సెక్స్‌ 132 పాయింట్ల నష్టంతో  52350  వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు క్షీణించి 15688 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, ప్రభుత్వ బ్యాంక్, ఐటీ, మీడియా నష్టాల్లో, మిడ్ అండ్‌ స్మాల్ క్యాప్ షేర్లు మిశ్రమంగానూ  ట్రేడవుతున్నాయి.  అయితే ఆటో షేర్లు జోరుగా ఉన్నాయి. 

ముఖ్యంగా క్యూ4 ఫలితాలతో వొడాఫోన్‌ ఐడియా 10 శాతం కుప్పకూలింది. వొడాఫోన్ ఐడియా 2021 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 7,022.8 కోట్ల రూపాయల నికర నష్టాన్నినివేదించింది. బజాజ్ ఆటో 2.33 శాతం ఎగిసింది. ఇంకా మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, హిందాల్కో, ఎస్బిఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, శ్రీసిమెంట్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, భారత్ పెట్రోలియం, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్  నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు