Stock Market Today: ఐటీ బేజారు, నష్టాల్లో మార్కెట్లు

10 Aug, 2022 10:03 IST|Sakshi

17500 దిగువకు నిఫ్టీ

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు   నష్టాల్లో కొనసాగుతున్నాయి.  ముఖ్యంగా బ్యాంకింగ్‌ షేర్ల నష్టాలు మార్కెట్లను నష్టాల్లోకి మార్చాయి.సెన్సెక్స్ 212 పాయింట్లు నష్టపోయి 58,640వద్ద, నిఫ్టీ 66 పాయింట్లు నష్టపోయి 17,462 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియాల్టీ షేర్లు కుదేలయ్యాయి. అయితే ఆటో, నిఫ్టీ ఎఫ్‌ఎమ్‌సిజి సూచీలు లాభాల్లో ఉన్నాయి.

సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, నెస్లే ఇండియా, యూపీఎల్‌  షేర్లు లాభపడుతున్నాయి. మరోవైపు ఎన్టీపీసీ, అదానీ, విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌ నష్ట పోతు న్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 18 పైసలు లాభంతో 79.52 వద్ద కొనసాగుతోంది.  మొహర్రం కారణంగా  దేశీ స్టాక్‌ మార్కెట్లకు మంగళంవారం సెలవు.

మరిన్ని వార్తలు