Stock Market: వరుస లాభాలకు చెక్‌, బ్యాంకింగ్‌ ఢమాల్‌: ఫ్లాట్‌గా ముగింపు

4 Aug, 2022 16:25 IST|Sakshi

మెరిసిన ఐటీ, ఫార్మా

 కుదేలైన బ్యాంకింగ్‌ షేర్లు

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  ఫ్లాట్‌గా ముగిసాయి. రోజు సానుకూలంగా ప్రారంభమైనా తరువాత కీలక సూచీలు ఒడిదుకుకులనుఎదుర్కొన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ షేర్ల నష్టాలు మార్కెట్లను నష్టాల్లోకి మార్చాయి.చివరికి సెన్సెక్స్ 51 పాయింట్లు నష్టపోయి 58,298 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 17,382 వద్ద ముగిశాయి. ఐటీ, ఫార్మా షేర్లు  లాభపడగా, బ్యాంకింగ్‌ షేర్లు కుదేలయ్యాయి.

గురువారం నాటి సెషన్‌లో ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, రిలయన్స్ క్షీణించగా, సిప్లా, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా లాభపడ్డాయి. మరోవైపు అమెరికా-చైనా టెన్షన్‌తో ఒడిదుడుకులు తగ్గడంతో ఇతర ఆసియామార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. అటు డాలరుమారకంలో రూపాయి మళ్లీ బలహీన ట్రెండ్‌లోకి మారింది. డాలరు మారకంలో 48పైసలు నష్టంతో 79.54 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు