TodayStockMarket: లాభాలకు చెక్‌, సెన్సెక్స్‌ 317 పాయింట్లు పతనం

17 Feb, 2023 16:43 IST|Sakshi

అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ టాప్‌ లూజర్‌ 

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి.వరుస లాభాల తరువాత సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ  డేటాషాక్‌తో మళ్లీ వడ్డీ రేటు పెంపు ఉంటుందనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాయి. ఆర్థిక, ఐటీ ,ఎఫ్‌ఎమ్‌సిజి షేర్లు అమ్మకాల ఒత్తిడి ప్రభావం చూపింది. ఫలితంగా సెన్సెక్స్ 317 పాయింట్లు నష్టపోయి 61,003 వద్ద,  నిఫ్టీ  92 పాయింట్లు క్షీణించి 17,944 వద్ద స్థిరపడింది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్, నెస్లే, ఇండస్‌ఇండ్, ఎస్‌బిఐ లైఫ్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా , ఎస్‌బీఐ టాప్‌ లూజర్స్‌గా, మరోవైపు లార్సెన్ అండ్ టూబ్రో, అల్ట్రాటెక్, భారత్ పెట్రోలియం, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, గ్రాసిమ్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. హెవీవెయిట్‌లలో, ఇన్ఫోసిస్, టిసిఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్  కూడా భారీగా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 83 స్థాయి వైపు పయనిస్తోంది. డాలరు బలం పుంజుకోవడంతో రూపాయి 14పైసల నష్టంతో 82.83వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు