StockmarketUpdate కొనసాగుతున్న ఐటీ షేర్ల పతనం: మార్కెట్‌ ఢమాల్‌!

12 Dec, 2022 09:24 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ 451 పాయింట్లు కుప్పకూలి 61735 వద్ద, నిఫ్టీ 120 పాయింట్లు నష్టంతో 18375 వద్ద కొనసాగుతున్నాయి.

ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, విప్రో తదితర ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఐషర్‌, మారుతి లాంటి ఆటో షేర్లుకూడా  బలహీనంగా ఉన్నాయి.  ఐటీసీ, ఎం అండ్‌, నెస్లే, కోల్‌ ఇండియా, డా. రెడ్డీస్‌   గ్రాసిం, ఎన్టీపీసీ లాభపడుతున్నాయి. 

ఈ సాయంత్రం విడుదల  కానున్న నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా, అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) డేటాకానుందని పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు సులా వైన్యార్డ్స్ , అబాన్స్ హోల్డింగ్స్ IPO ఈరోజు  షురూ కానుంది.  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు