అమ్మకాల ఒత్తిడి : మార్కెట్ ఢమాల్

3 Aug, 2020 15:01 IST|Sakshi

సుమారు 700 పాయింట్లు పతనమైన మార్కెట్ 

37 వేల దిగువకు సెన్సెక్స్

11 వేల దిగువకు నిఫ్టీ

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్  మార్కెట్ భారీ నష్టాల్లోకి జారిపోయింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే నష్టపోయిన కీలక సూచీలు అనంతరం మరింత క్షీణించాయి. అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్ ఏకంగా 693 పాయింట్లు కుప్పకూలి 37వేల దిగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 186 పాయింట్ల నష్టంతో 10907 వద్ద 11 వేల స్థాయిని కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి.  తద్వారా మార్కెట్ రెండు వారాల కనిష్టానికి చేరింది.  

ప్రధానంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. యూపీఎల్, ఇండస్ ఇండ్, కోటక్ మహీంద్ర, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో, జీ భారీగా నష్టపోతున్నాయి. టెక్ షేర్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. దీంతో ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇతరాలు నష్టాల్లో ఉన్నాయి.  బంధన బ్యాంకు ప్రమోటర్ 20.95 శాతం వాటా విక్రయం వార్తలతో బంధన్ బ్యాంకు 11 శాతం నష్టపోయింది. మరోవైపు  టాటా మోటార్స్, టైటన్, టాటా స్టీల్, బీపీసీఎల్ లాభపడుతున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి తిరిగి 75 రూపాయల స్థాయికి పడిపోయింది.

మరిన్ని వార్తలు