అమ్మకాల జోరు, 47వేల దిగువకు సెన్సెక్స్‌

28 Jan, 2021 10:27 IST|Sakshi

సాక్షి, ముంబై:  ఫిబ్రవరి 1న  రానున్న కేంద్ర బడ్జెట్, అంతర్జాతీయ  ప్రతికూల సంకేతాల నడుమ దేశీయ మార్కెట్లు వరుసగా ఐదోరోజు కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దీనికి తోడు జనవరి ఫ్యూచర్స్ ,  ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు  ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ జోరుగా కొనసాగుతోంది. ఫలితంగా సూచీలు నెల రోజుల కనిష్టానికి పతనమైనాయి. సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ గరిష్టం నుంచి 3వేల పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు నష్టపోవడం గమనార్హం.

గురువారం ఒక దశలో సెన్సెక్స్ 589 పాయింట్ల వరకు పడిపోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి 46,821 ను తాకింది.  నిఫ్టీ ముఖ్య మద్దతు స్థాయి 13,800 దిగువకు చేరువలో ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 457  పాయింట్లు కోల్పోయి‌ 46956 వద్ద 47 వేల దిగువకు చేరింది. నిఫ్టీ 130 పాయింట్లకు పైగా పతనమై 13836 వద్ద కొనసాగుతోంది. పవర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్వల్పంగా లాభపడుతుండగా, బ్యాంకింగ్, రియాల్టీ, ఆటో, ఐటి, పవర్, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

పవర్‌గ్రిడ్, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, కోటక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్‌, యూపీఎల్, టెక్‌ఎం, నెస్లే ఇండియా, హెచ్‌డిఎఫ్‌సీ భారీగా నష్ట పోతున్నాయి. మరోవైపు రిలయన్స్ , ఓన్‌జీసీ, బిపిసిఎల్, ఎన్‌టిపిసి, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీసిమెంట్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి.
 

మరిన్ని వార్తలు