StockMarketClosing: రూ. 2.21 లక్షల కోట్లు హుష్‌ కాకి, చివరికి..

14 Sep, 2022 16:05 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలనుంచి కోలుకున్నా చివరకు నష్టాల్లోనే ముగిసాయి.  ఆరంభం  నష్టాల నుంచి  కోలుకున్నాయి. అలాగే  మిడ్‌ సెషన్‌ తరువాత లాభాల్లోకి మళ్లాయి సూచీలు. కానీ చివరి గంటలోతిరిగి అమ్మకాలు వెల్లువెత్తాయి.  ఫలితంగా సెన్సెక్స్‌ 224 పాయింట్లు లేదా 0.4 శాతం క్షీణించి 60,347 వద్ద, నిఫ్టీ 66 పాయింట్లు లేదా 0.4 శాతం నష్టంతో 18004 వద్ద స్థిరపడ్డాయి. ఫైనాన్షియల్స్‌, మెటల్‌లాభపడగా, ఐటీ షేర్లు భారీ నష్టాలను మూటగట్టు కున్నాయి. గ్లోబల్‌ మార్కెట్లు భారీ పతనాన్నినమోదు చేసినప్పటికీ,  సెన్సెక్స్‌, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలకు పైన నిలబడటం విశేషం.

ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టిపిసి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు ఇండెక్స్‌లో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. మరోవైపు, ఇన్ఫోసిస్,  టీసీఎస్‌, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్  టాప్‌  లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 37 పైసలు క్షీణించి 79.44 వద్ద ముగిసింది. 

కాగా, అధిక ద్రవ్యోల్బణం, గ్లోబల్ ట్రెండ్‌, ఫెడ్‌ భారీగా వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాల మధ్య మార్కెట్‌లో బుధవారం నాటి  ఆరంభ ట్రేడింగ్‌లో పెట్టుబడిదారుల సంపద రూ. 2.21 లక్షల కోట్లకు పైగా  తుడుచుపెట్టుకు పోయింది. అయితే  ఈ నష్టాలనుంచి  కోలుకోవడంతో  కాస్త  ఇన్వెస్టర్లు కాస్త ఊరట చెందారు.

>
మరిన్ని వార్తలు