StockMarketClosing: ఆటో జోరు, 62 వేలకు చేరువలో సెన్సెక్స్‌

15 Nov, 2022 15:57 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు అనూహ్యంగా లాభాలతో ముగిసాయి. మిశ్రమ ప్రపంచ సూచనల మధ్య ఆరంభంలో స్వల్పంగా లాభపడిన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. రోజంతా లాభనష్టాల మధ్య కదలాడిన సూచీలు చివరకు భారీ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్‌ 249 పాయింట్లు ఎగిసి 61872 వద్ద,నిఫ్టీ  74 పాయింట్ల లాభంతో 18403 వద్ద స్థిరపడ్డాయి.  ఆటో షేర్ల లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. తద్వారా నిఫ్టీ 18400 స్థాయికి  ఎగువనముగిసింది. సెన్సెక్స్‌ 62 వేలకు చేరువలో ఉంది. 

పవర్‌ గ్రిడ్‌, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతి  ఎయిర్టెల్‌, హీరోమోటో టాప్‌ విన్నర్స్‌గానూ,  కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, సిప్లా,గ్రాసిం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌,నెస్లే, ఐటీసీ, టీసీఎస్‌, రిలయన్స్, టాప్‌ లూజర్స్‌గాను నిలిచాయి.  అటు డాలరుమారకంలో రూపాయ 20 పైసలు  పుంజుకుని 81,09 వద్ద ముగిసింది. 

పెరిగిన వాణిజ్య లోటు
అక్టోబర్ వాణిజ్య లోటు వార్షిక ప్రాతిపదికన  26.91 బిలియన్  డాలర్లుకు పెరిగింది. గత  ఏడాది 17.91 బిలియన్ డాలర్లు ఉంది. అక్టోబర్ దిగుమతులు 56.69 బిలియన్  డాలర్లుగాను, ఎగుమతులు  35.73బిలియన్  డాలర్లుగా నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు