StockmarketClosing: ఫెడ్‌ వడ్డన భయాలు, అమ్మకాల జోరు

21 Sep, 2022 15:47 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి.గ్లోబల్‌ మార్కెట్ల బలహీన సంకేతాలు, ఫెడ్‌ రేటు పెంపు భయాలతో ఆరంభంలోనే భారీగా నష్టపోయిన సూచీలు మిడ్‌సెషన్‌లో చాలా బాగా  పుంజుకున్నాయి.కానీ చివర్లో మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో కీలక మద్దతుస్థాయిలకు దిగువకు చేరాయి.సెన్సెక్స్‌  263 పాయింట్లుకుప్పకూలి 59456 వద్ద, నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 17718 వద్ద ముగిసాయి. తద్వారా   సెన్సెక్స్‌  59, 500 స్థాయిని, నిఫ్టీ 17800 స్థాయిని కోల్పోయాయి. దాదాపు అన్నిరంగాల షేర్లు ఒత్తడి మధ్య కొనసాగాయి.

బ్రిటానియా, హెచ్‌యూఎల్‌, అపోలో హాస్పిటల్స్‌,కోల్‌ ఇండియా, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకీ,సన్ ఫార్మా, ఐటిసి షేర్లు టాప్‌విన్నర్స్‌గా నిలవగా, శ్రీ సిమెంట్స్‌, అదానీపోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌, పవర్‌ గ్రిడ్‌, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, టిసిఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 28పైసలు కుప్పకూలి 79.97వద్ద 80 మార్క్‌కు చేరువలో ఉంది. 

మరిన్ని వార్తలు