stockmarket: నాలుగురోజుల లాభాలకు చెక్‌

16 Jun, 2021 16:23 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. ఆరంభంనుంచీ బలహీనంగా ఉన్న సూచీలు చివరి వరకూ అదే ధోరణిని కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్ల నష్టాలు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. సెన్సెక్స్ 271.07 పాయింట్లు క్షీణించి 52,502 వద్ద, 102  పాయింట్ల నష్టంతో  15,768 వద్ద ముగిసింది. నిఫ్టీ 15800 స్థాయి దిగువకు చేరింది.  తద్వారా నాలుగు రోజుల వరుస లాభాలకుచెక్‌ పెట్టాయి. ఎఫ్‌ఎంసిజి, ఐటి సూచీలు  లాభపడ్డాయి. టాటా కన్స్యూమర్, నెస్లే ఇండియా ఒఎన్‌జిసి, ఎన్‌టిపిసి, హెచ్‌యుఎల్ లాభపడగా టాటా స్టీల్, హిండాల్కో ఇండస్ట్రీస్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, పవర్‌గ్రిడ్ నష్టపోయాయి. అటు బిలియనీర్ గౌతమ్ అదానీ  కంపెనీల షేర్లు బుధవారం కూడా నష్టాలను చవి చూశాయి. 

చదవండి : సంచలనం: గంగానదిలో చెక్కెపెట్టెలో చిన్నారి
SBI ఖాతాదారులూ ముఖ్య గమనిక!
MacKenzie: జెఫ్‌ బెజోస్‌ భార్య వేల ‍కోట్ల విరాళం

మరిన్ని వార్తలు