స్టాక్ మార్కెట్లకు ఆర్‌బీఐ అండ!

7 Apr, 2021 17:56 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఆర్‌బీఐ తీసుకున్న ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు స్టాక్‌మార్కెట్‌కు‌ మాంచి బూస్ట్‌లా పనిచేశాయి. ఆరంభం నుంచి ఉత్సాహంగానే ఉన్న కీలక సూచీలు ఆ తరువాత మరింత జోష్‌గా కొనసాగాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచనున్నామన్న ఆర్‌బీఐ ప్రకటన తర్వాత సూచీ ఒక్కసారిగాపైకి ఎగిసింది. సెన్సెక్స్ చివరకు 460 పాయింట్ల లాభంతో 49,661 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఆఖరుకు 135 పాయింట్లు లాభపడి 14,819 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.38 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు సూచీలకు అండగా నిలిచాయి. అమెరికాలో 10 ఏళ్ల బాండ్ల ప్రతిఫలాలు స్వల్పంగా తగ్గాయి. దీంతో ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపించింది. నేడు ఒక్క ఇంధనం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనించాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, విప్రో లిమిటెడ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు లాభాలతో ముగిస్తే. అదానీ పోర్ట్స్‌, టాటా కన్సూమర్‌ ప్రోడక్ట్స్‌, యూపీఎల్‌, ఎన్‌టీపీసీ, టైటాన్‌ కంపెనీ షేర్లు నష్టాలతో ముగిసాయి.

చదవండి: భారీగా పెరిగిన బంగారం ధరలు

>
మరిన్ని వార్తలు