కొనసాగుతున్న కోవిడ్‌ సెగ: మార్కెట్లు పతనం

4 May, 2021 15:51 IST|Sakshi

సెన్సెక్స్‌ 465 పాయింట్లు పతనం

14500 దిగువకు నిఫ్టీ

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో వరుసగా రెండో రోజు కూడా భారీ నష్టాలతో ముగిశాయి. ఒడిదుడుకుల మధ్య రోజంతా బలహీనంగా కొనసాగిన సూచీలు మిడ్‌ సెషన్‌ తరువాత మరింత కుదేలయ్యాయి. చివరకు 465 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ 48253 వద్ద, 138 పాయింట్లు  పతనమైన నిఫ్టీ 14496 వద్ద బలహీనంగా ముగిసాయి.   దాదాపు అన్ని రంగా షేర్లు నష్టాల్లోనే ముగిసాయి. 

టైటన్‌, ఇండస్‌ ఇండ్‌, రియలన్స్‌,   యాక్సిస్‌ బ్యాంకు,  టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.  బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌ లాభపడ్డాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి డాలర్‌తో  పోలిస్తే10 పైసలు  లాభపడి 73.85 వద్ద ముగిసింది

మరిన్ని వార్తలు