మార్కెట్ల లాభాల జోరుకు బ్రేక్!

19 Oct, 2021 16:18 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ల జోరుకి నేడు బ్రేక్ పడింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఒక దశలో 62,245 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత గరిష్ఠ స్థాయిలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఆరంభ లాభాలను కోల్పోయిన సెన్సెక్స్‌ నష్టాల్లోకి జారుకుంది. ముగింపులో, సెన్సెక్స్ 49.54 పాయింట్లు (0.08%) క్షీణించి 61716.05 వద్ద నిలిస్తే, నిఫ్టీ 58.20 పాయింట్లు (0.31%) క్షీణించి 18418.80 వద్ద ఉంది. నేడు సుమారు 959 షేర్లు అడ్వాన్స్ అయితే, 2321 షేర్లు క్షీణించాయి, 122 షేర్లు విలువ మారలేదు.

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.02 వద్ద ఉంది. నిఫ్టీలో టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ఎక్కువ లాభాలు పొందితే... నష్టపోయిన వాటిలో ఐటీసీ, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, హెచ్‌యుఎల్, టైటాన్ కంపెనీ ఉన్నాయి. ఐటీ, క్యాపిటల్ గూడ్స్ మినహా అన్ని ఇతర సెక్టోరల్ సూచీలు నష్టాల్లో ముగిశాయి.(చదవండి: కంప్యూటర్ క్లీన్ చేసే ఈ క్లాత్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!)

మరిన్ని వార్తలు