భారీ లాభాలు, సెన్సెక్స్‌ మళ్లీ 59 వేల పాయింట్ల ఎగువకు

11 Aug, 2022 15:40 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో   ఆరంభంలోనే 600 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌ చివరికి 59వేల ఎగువన ముగిసింది. సెన్సెక్స్‌ 515పాయింట్లు ఎగిసి 59332 వద్ద,  నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో  17659 వద్ద   స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిసాయి.

ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. యాక్సిస్‌ బ్యాంకు, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్ర, టీసీఎస్‌ టాప్‌ విన్నర్స్‌గా నిలిచాయి. మరోవైపు టాటా కన్జ్యూమర్స్‌,అపోలో హాస్పిటల్స్‌, ఐటీసీ, హిందాల్కో, ఎన్టీపీసీ నష్టాల్లో ముగిసాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి బలహీనపడి 14 పైసల నష్టంతో 79.63వద్ద ఉంది. 
చదవండి: 75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్‌ , బిగ్‌ ఇన్వెస్టర్‌గా అదానీ

మరిన్ని వార్తలు