భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

22 Dec, 2021 16:08 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కనబరిచాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగడం, ఇటీవలి భారీ పతనం తర్వాత కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడటంతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 611.55 పాయింట్లు(1.09%) పెరిగి 56,930.56 వద్ద ఉంటే, నిఫ్టీ 184.70 పాయింట్లు(1.10%) లాభపడి 16,955.50 వద్ద ముగిసింది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.53 వద్ద ఉంది. హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, దివిస్ లేబొరేటరీస్, బజాజ్ ఫైనాన్స్, ఐచర్ మోటార్స్ షేర్లు నిఫ్టీలో ఎక్కువ లాభపడితే.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, విప్రో, అదానీ పోర్ట్స్, ఐఓసిఎల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఆటో, బ్యాంక్, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఆయిల్ & గ్యాస్, పవర్, మెటల్ సూచీలు 1-3 శాతం పెరగడంతో అన్ని సెక్టోరల్ సూచీలు లాభాల్లో ముగిశాయి. బిఎస్ఇ మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా పెరిగాయి.

(చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలు కొంటె భారీగా పన్ను మినహాయింపు.. ఎంతో తెలుసా?)

>
మరిన్ని వార్తలు