స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

22 Jun, 2021 16:16 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఒకానొక దశలో 483 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 53,057 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు డీలాపడ్డాయి. చివరకు సెన్సెక్స్‌ 14 పాయింట్ల స్వల్ప లాభంతో 52,588 వద్ద ముగిస్తే, నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 15,772 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.38 వద్ద నిలిచింది. 

ఇక బీఎస్‌ఈ 30 సూచీలో మారుతీ, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్ సిమెంట్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌, షేర్లు లాభాల్లో ముగిస్తే.. ఏషియన్ పెయింట్స్‌, బజాజ్ ఫినాన్స్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కొటక్ మహీంద్రా బ్యాంక్‌, టెక్ మహీంద్రా, సన్‌ ఫార్మా షేర్లు నష్టాలను చవిచూశాయి.

చదవండి: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్!

మరిన్ని వార్తలు