బ్యాంక్స్‌, మెటల్‌ దెబ్బ: నష్టాల ముగింపు

17 Jun, 2021 15:56 IST|Sakshi

15700 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ

మెటల్‌, బ్యాంకింగ్‌  షేర్లకు వరున నష్టాలు

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో వరుస లాభాలకు చెక్‌ పెడుతూ బుధవారం భారీగా నష్టపోయిన మార్కెట్‌ గురువారం కూడా అదే బాటలో పయనించింది. ఆరంభంలోనే భారీ నష్టాలను చవి చూసింది. కీలక సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడ్‌ అయ్యాయి. దాదాపు అన్ని రంగాల  షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఒక దశలో 400 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌ మిడ్‌ సెషన్‌ తరువాత పుంజుకున్నా, చివరికి 52400 దిగువన ముగిసింది. నిఫ్టీ కూడా అదే దోరణిని కొనసాగించి కీలకమైన 15700 దిగువనే  ముగిసింది. సెన్సెక్స్‌ 179 పాయింట్లు క్షీణించి 52323 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు పతనమై 15691 వద్ద స్థిరపడింది.

మెటల్‌, బ్యాంకింగ్‌, ఐటీ, ఆటో,కేపిటల్, మిడ్ క్యాప్ స్టాక్స్‌నష్టాలను మూటగట్టుకోగా,  కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, స్మాల్ క్యాప్ స్వల్ప లాభాలకు పరిమిత మైనాయి. అటు వరుసగా నాలుగో సెషన్‌లో కూడా అదానీ గ్రూపు షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఏషియన్ పెయింట్స్,  అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, శ్రీ సిమెంట్స్, టాటా మోటర్స్ లాభపడగా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, హిందాల్కో,  హీరోమోటో కార్ప్, హెచ్‌డిఎఫ్‌సీ నష్టపోయాయి. అటు రూపాయికూడా భారీగా నష్టపోయింది. డాలరు మారకంలో  74.08 వద్ద స్థిరపడింది. ఏప్రిల్‌ 7 తరువాత ఇదే  ఎక్కువ నష్టం.  బుదవారం  73.32 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు