రోజంతా నష్టాలే; బ్యాంకింగ్‌, ఐటీ షేర్ల దెబ్బ

29 Jun, 2022 15:42 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నప్పటికీ, నష్టాలు తప్పలేదు.కానీ కనిష్ట స్థాయిల నుండి పాక్షికంగా కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 53 వేల ఎగువన ముగిసింది. అయితే మరో  కీలక  సూచీ నిఫ్టీ 15800 దిగువకు  చేరింది. 

సెన్సెక్స్‌ 134 పాయింట్లను​ కోల్పోయి 53027 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 15799 వద్ద స్థిరపడింది. ఆయిల్‌ రంగం తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను చవి చూశాయి. ముఖ్యంగా బ్యాంక్, ఎఫ్‌ఎంసిజి, ఐటీ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి.

ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, రియలన్స్‌, సన్‌ఫార్మ, కోల్‌ ఇండియా టాప్‌ గెయినర్స్‌గా నిలవగా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌యూఎల్‌, అపోలో హిస్పిటల్స్‌, యాక్సిస్‌ బ్యాంకు, టాటాసన్స్‌ నష్టపోయాయి. 

మరోవైపు డాలరు మారకంలో రూపాయి బుదవారం కూడా రికార్డు క్లోజింగ్‌ను నమోదు  చేసింది. వరుసగా పతనమవుతున్న రూపాయి 78.97 వద్ద ఆల్‌ టైం కనిష్టానికి చేరింది. చివరికి 78.96 వద్ద క్లోజ్‌ అయింది. 

మరిన్ని వార్తలు