StockMarketclosing: కీలక మద్దతు స్థాయిలకు దిగువన సూచీలు

15 Sep, 2022 15:35 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల  బలహీనంగా ఉన్నప్పటికీ ఉదయం పటిష్టంగా ఉన్న మార్కెట్లు గురువారం కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్‌ డే హైనుంచి ఏకంగా 600పాయింట్లకు పైగా కుప్పకూలింది.  ఫలితంగా  60వేల స్థాయిని  కోల్పోయింది. నిఫ్టీ కూడా 18వేలస్థాయి దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లునష్టాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్‌  413 పాయింట్లు కుప్పకూలి 59934 వద్ద, నిఫ్టీ 126 పాయింట్లు  క్షీణించి 17877 వద్ద  ముగిసాయి.

మారుతి సుజుకి, పవర్‌ గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, ఐషర్‌ మోటార్స్‌, ఎన్టీపీసీ లాభపడగా,  హిందాల్కో,  టెక్‌ మహీంద్ర, ఇన్ఫోసిస్‌, సిప్లా, హీరో మోటాకార్ప్‌ నష్టపోయాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయల 31పైసలు నష్టంతో 79.69 వద్ద  ఉంది.

మరిన్ని వార్తలు