లాభాల స్వీకరణ, సెన్సెక్స్‌ 280 పాయింట్లు డౌన్‌

18 Aug, 2022 09:39 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. వరుస లాభాలు, హైస్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు తగ్గుముఖం పట్టాయి.  ఫలితంగా సెన్సెక్స్‌  60వేల  పాయింట్లు దిగువకు, నిఫ్టీ 17900 దిగువకు చేరాయి. సెన్సెక్స్‌ 280 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 56 పాయింట్లు నష్టపోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనే అమ్మకాలు కనిపిస్తున్నాయి.  

దీనికి తోడు జూలై ఫెడ్‌ మినిట్స్ లో ఎలాంటి దిశానిర్దేశం చేయకపోవడం, సెప్టెంబర్‌లో  మరో  75 బేసిస్ పాయింట్ల వడ్డీరెటుపెంపు తప్పదన్న అంచనాలతో  గ్లోబల్‌ మార్కెట్ల సెంటిమెంట్‌ దెబ్బతింది.  దేశీయంగా గురువారం నాటి మార్కెట్లో ఐటీ, ఫార్మ రంగాలు నష్టపోతున్నాయి.  హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐటీసీ, ఐషర్‌  మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌, ఎస్‌బీఐ లైఫ్‌ టాప్‌ గెయినర్స్‌గా కొనసాగుతుండగా, డా.రెడ్డీస్‌, ఓఎన్జీసీ, సన్‌ ఫార్మ, విప్రో, బీపీసీఎల్‌ నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 26 పాయింట్లు నష్టంతో 78.65 కి చేరింది.

మరిన్ని వార్తలు