ఐటీ షాక్‌: నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

25 May, 2022 15:46 IST|Sakshi

 ఆరంభ లాభాలను కోల్పోయిన మార్కెట్‌

54 వేల దిగువకు సెన్సెక్స్‌

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఆరంభంలోనే 300  పాయింట్లకుపైగా ఎగిసిన సెన్సెక్స్‌  వెంటనే   ఆరంభ  లాభాలను కోల్పోయింది.మిడ్‌ సెషన్‌ నుంచి  మరింత బలహీనపడింది. చివరకు  సెన్సెక్స్‌, నిఫ్టీ  నష్టాలతో వద్ద ముగిసింది.  ఫెడరల్ రిజర్వ్  రేట్ల పెంపునకు మొగ్గు చూపనుందనే అంచనాలు ట్రేడర్లను ప్రభావితం చేశాయి.సెన్సెక్స్‌ 303 నిఫ్టీ 99  పాయింట్లు కోల్పోయాయి.

బుధవారం నాటి నష్టాలతో సెన్సెక్స్‌ 54 వేల స్థాయి దిగువకు  చేరింది.  నిఫ్టీ 1600 వద్ద ఊగిసలాడుతోంది. రియల్టీ, ఐటీ షేర్లు బాగా నష్టపోయాయి.  బ్యాంక్ మినహా అన్ని రంగాల సూచీలు ఆయిల్ అండ్‌ గ్యాస్, మెటల్, రియాల్టీ, పవర్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ ఇండెక్స్ 2-3శాతం క్షీణించాయి. కెమికల్‌, సుగర్‌ రంగ షేర్లు భారీ నష్టాలను మూటగట్టు కున్నాయి. రెడ్‌లో ట్రేడవుతున్నాయి. దీపిక్‌, చంబల్‌ ఫెర్టిలైజర్స్ నష్టపోయాయి. ఫలితాల దెబ్బతో దివీస్‌ భారీగా నష్టపోయింది. అలాగే ఏసియన్‌ పెయింట్స్‌, కోరమండల్‌ ఇంటర్నేషనల్‌,  టెక్‌ మహీంద్ర నష్టాల్లో ముగిసాయి. ఎన్టీపీసీ, బ్రిటానియా, కోటక్‌,   హెడ్‌ఎఫ్‌సీ, ఐసీఐసీఐ, నెస్లే, ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు