Stock Market: ముడి చమురు సెగ: నష్టాల్లో మార్కెట్లు

31 May, 2022 09:40 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాలతో ప్రారంభమైనాయి. గత రెండు రోజుల భారీ లాభాలకు  చెక్‌పెడుతూ సెన్సెక్స్‌ 500 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయింది.  ముడి చమురు ధరల పెంపు,అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఈ నష్టాలు  కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ (-477) 55448 వద్ద, నిఫ్టీ (-119) 16542 వద్ద కదలాడుతోంది. రంగాల వారీగా ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు ఐటీ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అలాగే గత క్వార్టర్‌తో పోలిస్తే లాభాలు క్షీణించడంతో ఎల్‌ఐసీ షేర్లు 2శాతం నష్ట పోతున్నాయి.  మార్చి త్రైమాసికంలో రూ. 2,371.55 నికర లాభాన్ని నివేదించింది, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని రూ. 2,893 కోట్ల నికర లాభంతో పోలిస్తే 18 శాతం తగ్గింది.

సన్ ఫార్మా, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, టైటన్, కోటక్ బ్యాంక్, విప్రో, టీసీఎస్ టెక్ మహీంద్రా 1-2 శాతం పతనమై టాప్‌లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ మాత్రమే లాభపడుతున్నాయి. 

మరిన్ని వార్తలు