ఆర్బీఐ కీలక ప్రకటన, దేశీయ స్టాక్‌ మార్కెట‍్లపై బేర్‌ పంజా!

4 May, 2022 14:29 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట‍్లపై బేర్‌ పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా జాతీయ అంతర్జాతీయ పరిణామాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపడంతో వరుస నష్టాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆర్బీఐ తీసుకున్న కీలక ప్రకటనతో దేశీయ సూచీలు భారీగా నష్టపోయాయి. 

రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ అధికారికంగా ప్రకటించారు. దీంతో మధ్యాహ్నం 2.20 గంటల సమయానికి సెన్సెక్స్‌ 956 పాయింట్ల భారీ నష్టపోయి 567019 వద్ద నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయి 16781 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది.

మరిన్ని వార్తలు