నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు: ఆగని రూపాయి పతనం

12 Jul, 2022 10:10 IST|Sakshi

సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్ 324 పాయింట్లు  54071 వద్దకు చేరుకోగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 16150 స్థాయిల దిగువకు చేరింది. సెన్సెక్స్‌ 217 పాయింట్ల నష్టంతో 54177 వద్ద, నిఫ్టీ 73  పాయింట్ల నష్టంతో 16143 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. 

అపోలో హాస్పిటల్స్‌, ఎన్టీపీసీ, డా. రెడ్డీస్‌, అదానీ పోర్ట్స్‌, విప్రో  లాభపడుతున్నాయి. మరోవైపు  హిందాల్కో, జేఎస్‌డబ్ల్యు స్టీల్‌, యూపీఎల్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ఫిన్‌ సర్వ్‌  ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ననష్టపోతున్నాయి.

అటు డాలరు మారకంలో రుపీ మంగళవారం మరో ఆల్‌ టైం కనిష్టానికి  చేరింది.  డాలరు పోలిస్తే 79.58  రికార్డు కనిష్టం వద్ద కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు