భారీ నష్టాల్లో​ స్టాక్‌మార్కెట్‌

11 May, 2021 13:50 IST|Sakshi

ప్రాఫిట్‌ బుకింగ్‌

సెన్సెక్స్‌ 433 పాయింట్లు పతనం

నిఫ్టీ 115 పాయింట్లు నష్టం

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఓపెనింగ్‌లోనే 450 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ప్రస్తుతం అదే స్థాయిలో కొనపాగుతోంది.  నిఫ్టీ 118 పాయింట్లు కుప్పకూలి 14824 వద్ద ట్రేడ్‌ అవుతోంది. దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో గత రెండు వారాలుగా పాజటివ్‌గా  మార్కెట్లు లాభాల స్వీకరణ కనిపిస్తోంది.  అటు ఎఫ్ఐఐల అమ్మకాలు కూడా కొనసాగుతున్నాయి. ఫార్మా స్టాక్స్‌లో  కొనుగోళ్లుకొనసాగుతున్నాయి. అయితే మెటల్‌ షేర్ల అమ్మకాలు మార్కెట్లను బలహీన పరుస్తున్నాయి. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్  నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్, ఎన్‌టిపిసి, అల్ట్రాటెక్  లాభపడుతున్నాయి. 
  

మరిన్ని వార్తలు