అమ్మకాల సెగ: 49 వేల దిగువకు నిఫ్టీ

19 Mar, 2021 10:24 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో  ఆరంభ నష్టాలనుంచి ఏ మాత్రం కోలుకోని కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి.దాదాపుఅన్ని రంగాలషేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రధానంగా బ్యాంకింగ్‌ షేర్లు బలహీనంగా ఉన్నాయి. ఫలితంగా  సెన్సెక్స్‌ 500 పాయింట్లకు పైగా కుప్పకూలింది. నిఫ్టీ 14 వేల దిగువకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 253 పాయింట్లు కోల్పోయి 48982 వద్ద, నిఫ్టీ 81 పాయింట్లు నష్టంతో 14476 వద్ద ట్రేడ్‌ అవుతోంది. పీఎస్‌యు బ్యాంక్ ఇండెక్స్ 3 శాతానికి పైగా పతనమైంది. నిఫ్టీ ఆటో, రియాల్టీ, బ్యాంక్, ఫైనాన్స్, మెటల్, మీడియా, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసిజి సూచీలు కూడా 1-3.5 శాతం మధ్య  క్షీణించాయి. 

టాటా మోటార్స్,  ఓఎన్‌జిసి,గెయిల్, ఎల్ అండ్ టీ, కోల్ఇండియా భారీగా నష్టపోతున్నాయి. ఇంకా  టాటా స్టీల్, మహీంద్రా అండ్‌  మహీంద్రా, జెఎస్‌డబ్ల్యు స్టీల్, అదానీ పోర్ట్స్, మారుతి సుజుకి, టైటాన్, బజాజ్ఆటో, ఐషర్ మోటార్స్‌ కూడా నష్టాల్లోనే ఉన్నాయి.మరోవైపు కోటక్ మహీంద్రా భారతి ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ స్వల్పంగా లాభపడుతున్నాయి. 

మరిన్ని వార్తలు