సెన్సెక్స్ 95 పాయింట్లు నష్టం

3 Sep, 2020 15:39 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిసాయి.మిడ్ సెషన్ లో డే హై నుచి 250 పాయింట్లు పతనమైన కీలక సూచీల చివర్లో  కాస్తా తేరుకున్నా నష్టాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు నష్టంతో 38990 వద్ద ముగిసింది. తద్వారా 39 వేల మార్క్ దిగువకు చేరింది. నిఫ్టీ 8 పాయింట్లు నష్టంతో 11527 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాల షేర్లలోను అమ్మకాల ఒత్తిడి కనిపించింది.  ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లు నష్టపోగా, ఐటీ, టెలికాం, ఏవియేషన్ షేర్లు లాభపడ్డాయి. కోటక్, యాక్సిస్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ,ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్ హిందాల్కో నష్టపోయాయి. మరోవైపు టాటా మోటార్స్, వొడాఫోన్, టైటన్, విప్రో, టెక్ మహీంద్ర లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు