లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్!

25 Jun, 2021 16:14 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. ఉదయం కాస్త కొద్దిగా ఊగిసలాట ధోరణి కనబరిచిన సూచీలు తర్వాత పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాల్ని నమోదు చేశాయి. లోహ, బ్యాంకింగ్‌ రంగాల మద్దతుతో పాటు టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ వంటి కీలక కంపెనీలు రాణించడంతో సూచీలు లాభాల వైపు పయణించాయి. చివరకు సెన్సెక్స్ 226.04 పాయింట్లు (0.43 శాతం) లాభపడి 52,925.04 వద్ద ముగిస్తే, నిఫ్టీ 69.90 పాయింట్లు(0.44 శాతం) పెరిగి 15860.40 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.17 వద్ద నిలిచింది. 

నిఫ్టీ50లో టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ముగిస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్‌టీపీసీ, టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి.

చదవండి: డ్రోన్‌లతో లాజిస్టిక్స్‌ డెలివరీకి రెడీ

మరిన్ని వార్తలు