ఉక్రెయిన్‌-రష్యా మధ్య చర్చలు...లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు..!

29 Mar, 2022 16:02 IST|Sakshi

ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య మరో రౌండ్‌ చర్చలు జరిగే నేపథ్యంలో మంగళవారం యూరోపియన్ స్టాక్‌మార్కెట్స్‌ పురోగమించాయి. ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉండడంతో ప్రధాన మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండడంతో దేశీయ మార్కెట్లు మంగళవారం రోజున లాభాల్లో ముగిశాయి.  బై అండ్‌ సెల్‌ వ్యూహం ఇన్వెస్టర్లలో కన్పించింది. దీంతో మార్కెట్లు కాస్త  ఊగిసలాడాయి. ఇక చివరి గంటలో స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలను గడించాయి. బీఎస్సీఈ సెన్సెక్స్‌ ఇండెక్స్ 350 పాయింట్లు లేదా 0.6 శాతం పెరిగి 57,944 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ ఇండెక్స్ 103 పాయింట్లు లేదా 0.6 శాతం పెరిగి 17,325 వద్ద స్థిరపడింది. 

అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, దివీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్‌టెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, శ్రీ సిమెంట్ లార్జ్ క్యాప్ స్పేస్‌ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.  హీరో మోటోకార్ప్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, మారుతీ సుజుకీ షేర్లు భారీగా పడిపోయాయి. 

గత వారం ఆదాయపు పన్ను శాఖ హీరో మోటో కార్ప్‌ దాడులను జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో హీరో మోటోకార్ప్ రూ. 1,000 కోట్లకు పైగా బోగస్ ఖర్చులు , రూ. 100 కోట్లకు పైగా నగదు లావాదేవీలు చేసిందని ఆదాయపు పన్ను శాఖ గుర్తించిన నివేదికలతో హీరో మోటోకార్ప్ షేర్లు 6 శాతానికి పైగా పడిపోయాయి.

చదవండి: అమెరికాలో రికార్డు సృష్టించిన మోటరోలా


 

మరిన్ని వార్తలు