ఆటో జోరు, సెన్సెక్స్‌ హుషారు

23 Jun, 2022 15:34 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 600పాయింట్ల మేర ఎగిసింది. నిఫ్టీ కూడా 15600 స్థాయిని దాటేసింది.  అయితే మిడ్‌ సెషన్‌నుంచి  లాభాల జోరు కాస్త తగ్గింది.  ఫలితంగా  సెన్సెక్స్‌ 443 పాయింట్లు ఎగిసి 52266 వద్ద,  నిఫ్టీ 162 పాయింట్ల లాభంతో 15575 వద్ద స్థిరపడ్డాయి.  అన్ని రంగాలు  లాభపడ్డాయి. ముఖ్యంగా ఆటో, ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో  కొనుగోళ్లు కనిపించాయి.

మారుతి సుజుకి, ఐషర్‌ మోటార్స్‌, హీరోమోటో,  ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఆటో భారీగా  లాభపడ్డాయి. మరోవైపు  రిలయన్స్‌, కోల్‌ ఇండియా, పవర్‌ గ్రిడ్‌, గ్రాసిం, ఎన్టీపీసీ  టాప్‌ లూజర్స్‌ గా నిలిచాయ.  అటు డాలర్‌మారకంలో రూపాయి  ప్రారంభంలో కాస్త మెరుగ్గా ఉన్నా ముగింపులో   లాభాలను నిలుపులేక పోయింది. ఆల్‌ టైం  కనిష్టం 78.40 తో  పోలిస్తే గురువారం  స్వల్పంగా లాభపడి  78.36వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు